పవన్ “ఓజి” స్టోరీ లైన్ వైరల్.!

పవన్ “ఓజి” స్టోరీ లైన్ వైరల్.!

Published on Feb 17, 2024 9:05 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ కూడా ఇవ్వడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది సుజీత్ రివీల్ చేసాడు. పవన్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అజ్ఞ్యాతంలో ఉన్న తాను మళ్ళీ వచ్చాడు అన్నట్టు చూపించారు. మరి లేటెస్ట్ గా ఓజి తాలూకా స్టోరీ లైన్ అన్నట్టుగా ఐఎండిబి లో ఓ లైన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ముంబైలోని పదేళ్ల కితం గ్యాంగ్ స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర ఎందుకు సడెన్ గా మాయం అయ్యి తన శత్రు మూకలపై రివెంజ్ తీర్చుకోడానికి వస్తాడు అనేది సారాంశం అన్నట్టుగా తెలిపారు. దీనితో ఈ మూలకథ సినీ వర్గాల్లో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. అయితే ఇందులో మొత్తం నిజం ఉండకపోవచ్చు మరి సుజీత్ ప్లాన్ చేస్తుంది ఏంటి అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు