పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజి’ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. కాగా, ఈ సినిమా నుంచి గతంలో వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయగా, అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.
ఇక ఇప్పుడు అభిమానులకు, ప్రేక్షకులకు పవర్ స్టార్ ఓ పండుగ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘ఓజి’ చిత్రం నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌ను సంక్రాంతి కానుకగా థియేటర్లలో వేయబోతున్నారట. ఈ మేరకు టీజర్ కట్‌కు సెన్సార్ కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలతో ఈ టీజర్‌ను రిలీజ్ చేస్తారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా పవన్ అభిమానుల్లో ‘ఓజి’ ట్రీట్ పై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.