తెలుగు సినిమాలో మైల్ స్టోన్ గా “ఓజి” నిలుస్తుంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ చిత్రంకి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తాను ఇచ్చిన హంగ్రీ చీతా స్కోర్ ఆల్రెడీ ఇప్పటికీ అంతా వింటున్నారు.

మరి లేటెస్ట్ గా థమన్ ఓ సోషల్ మీడియా స్పేస్ లో మాట్లాడుతూ ఓజితో అసలు మామూలుగా ఉండదు అని అలాగే ఓజి తెలుగులో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అని పవన్ ఫ్యాన్స్ కి గట్టి ఎగ్జైట్మెంట్ ని తాను అందించాడు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి తదితరులు నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version