తన సోదరితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన పవన్!

తన సోదరితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన పవన్!

Published on Aug 22, 2024 7:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ కి సంబందించిన విషయాలను చాలా తక్కువగా షేర్ చేస్తూ అంటారు. నేడు అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

రెండు బెంగాల్ టైగర్లు ఉన్న ప్రతిరూపాలతో పవన్ మరియు అతని సోదరి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో. తన సోదరి చేయి పట్టుకొని ఉన్న ఈ ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అభిమానులు లైక్స్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, మూడు బెంగాల్ టైగర్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు