దీక్ష ఆరంభించిన పవన్.. కొత్త లుక్ వైరల్

దీక్ష ఆరంభించిన పవన్.. కొత్త లుక్ వైరల్

Published on Jun 25, 2024 1:58 PM IST


టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్ననే టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు అంతా కూడా పవన్ ని కలిసేందుకు వెళ్లారు. ఇక ఇదిలా ఉండగా ఈ మీటింగ్ తర్వాత పవన్ వారాహి అమ్మవారు దీక్ష చేపట్టనున్నారని వారి హ్యాండిల్స్ నుంచి సమాచారం బయటకి వచ్చింది.

ఇక ఇప్పుడు నేటి నుంచే పవన్ ఈ దీక్షని ఆరంభించినట్టుగా కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. మరి పవన్ కాషాయ వర్ణ దుస్తులలో పవన్ ఈరోజు కనిపించి అదే లుక్ లో తన కార్య కలాపాల్లో పాల్గొన్నారు. మరి పవన్ ఈ దీక్షని మొత్తం 11 రోజులు పాటుగా కొనసాగించనుండగా ఈ దీక్షలో కేవలం ద్రవ, ఫలహారాలు మాత్రమే తీసుకోనున్నారట. ఇపుడు అయితే తన కొత్త లుక్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు