పవన్ – సుజిత్ సినిమా అనౌన్స్ మెంట్ తో షేక్ అవుతోన్న సోషల్ మీడియా!

Published on Dec 5, 2022 12:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిసారిగా భీమ్లా నాయక్ చిత్రం లో కనిపించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ స్టార్ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక పక్క హరిహర వీరమల్లు చిత్రం చేస్తూనే వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నేడు డివివి ఎంటర్ టైన్మెంట్ వారు యంగ్ డైరెక్టర్ సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ లతో సినిమా చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రానికి రవి కే.చంద్రన్ ను డివోపి గా తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతం గా వైరల్ అవుతోంది. దాదాపు 44 కే కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ అనౌన్స్ మెంట్ పోస్ట్. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. సాహో లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత సుజిత్ చేస్తున్న చిత్రం కావడం కూడా ఒకింత ఈ భారీ హైప్ కి కారణం అని చెప్పాలి. ఇక ఫ్యాన్ బాయ్ నుండి తమ అభిమాన స్టార్ హీరో కి డైరెక్షన్ చేయనుండటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :