లుక్స్‌పై ఫోకస్ పెట్టిన పవన్..?

లుక్స్‌పై ఫోకస్ పెట్టిన పవన్..?

Published on Mar 9, 2025 3:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫుల్ టైమ్ పోలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. దీంతో ఆయన లుక్స్ పరంగా కూడా కొంచెం మార్పు చెందారు. ‘మహా కుంభమేళా’ సందర్భంగా పవన్ లుక్స్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ నడిచింది. దీంతో పవన్ అభిమానులు ట్రోలర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన లుక్స్‌పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఆయన ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలను ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడని.. అందుకే తన లుక్స్, ఫిజిక్‌పై వర్కవుట్స్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు పూర్తి కాగానే, దర్శకుడు హరీష్ శంకర్ కోసం బల్క్ డేట్స్ కేటాయించి, ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని పవన్ భావిస్తున్నాడట.

ఇలా వరుసగా సినిమాలు ఫినిష్ చేసి కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోకుండా రాజకీయంగా బిజీగా ఉండేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడట. మరి పవన్ ఇప్పట్లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు