అక్టోబర్ 23 నుండి పవన్ కళ్యాణ్.. !

Published on Oct 17, 2020 4:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది. కానీ, లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ను అక్టోబర్ 23న నుండి మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని దాదాపు 20 రోజుల డేట్స్ ను పవన్ కేటాయించాడని తెలుస్తోంది.

వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తోంది. అలాగే నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే క్రిష్ – పవన్ సినిమా జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళనుంది. వచ్చే విజయదశమి పండుగ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

సంబంధిత సమాచారం :

More