తన చిత్రాల పై కీలక నిర్ణయం తీసుకున్న పవర్ స్టార్?

తన చిత్రాల పై కీలక నిర్ణయం తీసుకున్న పవర్ స్టార్?

Published on Jun 16, 2024 11:52 PM IST

పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త శక్తిగా అవతరించాడు. డిప్యూటీ సిఎం గా రాష్ట్ర ప్రజలకు తన సేవ అందించనున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న సినిమాల పై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చిత్రాలు పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నటించాల్సిన పార్ట్ కొద్దిగానే ఉన్నప్పటికీ, షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నాయి.

మూడు చిత్రాల కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ ను సర్దుబాటు చేసుకోనున్నారు. త్వరలో తన చిత్ర నిర్మాతలను కలిసి, తన కాల్షీట్ల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. తన మూడు చిత్రాల కోసం రెండు నెలల సమయం కేటాయించి, తదుపరి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండనున్నారు. అభిమానులు ఒక పక్క పవన్ కళ్యాణ్ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సాధించిన విజయం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు