HHVM: క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ నోట పాట!?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన ఎన్నికలకి ముందే కొన్ని నెలలు పవన్ షూటింగ్స్ అన్నీ ఆపేయగా మళ్ళీ చాలా నెలల తర్వాత ఈ సెప్టెంబర్ నుంచి తాను షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు ఓజి (OG), హరిహర వీరమల్లు (Harihara Veeramallu) షూటింగ్స్ ని తాను లైన్ లో పెట్టుకోగా అల్రెడీటీ వీరమల్లు షూటింగ్ లో తాను పాల్గొనడం కూడా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించే క్రేజీ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ సాలిడ్ యాక్షన్ తో పాటుగా పాట కూడా పాడబోతునట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సందర్భంలో అయితే పవన్ చేత పాట పాడించడానికి స్కోప్ ఉందట. దీనితో ఆ సాంగ్ ని ఇపుడు కీరవాణి పవన్ తోనే పాడించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనితో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ నోట మరో పాట రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version