పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా ?

పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా ?

Published on May 24, 2020 7:11 PM IST


ఈ కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయ్యేది. కానీ, లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఇప్పటికే సినీ పెద్ద‌లు సినిమా షూటింగ్స్ కోసం ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జరిపిన సంగతి తెలిసిందే త్వ‌ర‌లో షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి.

అయితే దిల్‌ రాజు ‘వ‌కీల్‌ సాబ్‌’ బ్యాలెన్స్ పార్ట్ ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నే ఉద్దేశ్యంతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ను జూన్‌ లో డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరారట. మరి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఓ స్టూడియోలో ప్రత్యేకంగా కోర్టు సెట్ వేసి మిగిలిన షూటింగ్ పూర్తి చేయనున్నారు.

ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు