సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా సాధించిన అనా కొణిదెల

సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా సాధించిన అనా కొణిదెల

Published on Jul 20, 2024 7:04 PM IST

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ కావడం విశేషం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో గ్రాండ్ గా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె ఈ పట్టాను స్వీకరించారు.

ఆసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం(ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్)లో ఆమె ఈ మాస్టర్స్ పూర్తి చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు తన భార్యకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అనా కొణిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివిన సంగతి తెలిసిందే. అక్కడ ఓరియంటల్ స్టడీస్‌లో ఆమె హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానం పై అధ్యయనానికి గాను ఆమె తొలుత డిగ్రీ పొందారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే ఆమె వివిధ భాషలు నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు. ప్రస్తుతం ఆమె రెండో మాస్టర్స్ డిగ్రీ సాధించడంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు