వైరల్ పిక్: తన తొలి హీరోయిన్ తో పవన్ కళ్యాణ్

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం తో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గా తన కర్తవ్యం ను నిర్వహిస్తున్నారు. నేడు నిర్మాతలతో జరిగిన సమావేశం లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యం గా తన తొలి హీరోయిన్ అయిన సుప్రియ పవన్ కళ్యాణ్ ను కలవడం.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు పూర్తి కావాల్సి ఉంది.

Exit mobile version