“ఓజి” ప్రొడ్యూసర్ తో పవన్ కళ్యాణ్!

“ఓజి” ప్రొడ్యూసర్ తో పవన్ కళ్యాణ్!

Published on Jun 24, 2024 7:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ డిప్యూటీ సిఎం అయ్యాక తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకి చెందిన నిర్మాతలు కలిశారు. సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో తన ఓజి చిత్రం నిర్మాత అయిన డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపారు. అంతేకాక ఒక ఫోటో ను కూడా షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఓజి చిత్రం ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలో సినిమాకి సంబందించిన అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రంకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు