లేటెస్ట్…పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఓఎస్టీ రిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం 2022 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ చిత్రం కి సంబందించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఓఎస్టీ ను రిలీజ్ చేయడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానా దగ్గుపాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు.

ఓఎస్టీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version