‘హరి హర వీరమల్లు’లో పవన్ కొత్త రకం యాక్షన్ !

‘హరి హర వీరమల్లు’లో పవన్ కొత్త రకం యాక్షన్ !

Published on Mar 7, 2021 8:16 PM IST

పవన్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. ఇక ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇప్పుడు, మీసం తిప్పడం, తొడ కొట్టి ఫైట్‌ చేసే సన్నివేశాలను పవన్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ ను ఈ సీన్స్ లో చూసి ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం. మరో వారం రోజులు పాటు ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీక్వెన్స్ నే షూట్ చేయనున్నారు.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ పిరియాడికల్ మూవీ సంక్రాంతి బరిలోనే నిలవనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు