సంక్రాంతికి పోటీలో పవన్, మహేష్

Published on Feb 26, 2021 11:00 pm IST

సంక్రాంతి అంటేనే పెద్ద సినిమాల పోటీతో కళకళలాడాలి. సినీ ప్రేక్షకులంతా ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ థ్రిల్ మిస్సయ్యారు ప్రేక్షకులు. ఈసారి కొన్ని సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి తప్ప భారీ సినిమాలేవీ రాలేదు. ఈసారి సంక్రాంతికి మాత్రం గట్టి పోటీనే ఉండనుంది. బరిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు పోటీపడబోతున్నాయి.

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పిరియాడికల్ మూవీ కూడ సంక్రాంతి బరిలోనే నిలవనుంది. ఇప్పటికే పవన చేసిన ‘వకీల్ సాబ్’ విడుదలకు రెడీగా ఉంది. అది కాకుండా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడ ఈ ఏడాదిలోనే విడుదలకానుంది. అందుకే క్రిష్ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారట. కాబట్టి 2022 సంక్రాంతి భారీ పోటీకి వేదికకానుంది. అభిమానులైతే ఈ పోటీ గురించి ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేసేశారు కూడ.

సంబంధిత సమాచారం :