మెంటల్ మాస్ లుక్ లో పవన్..వైరల్ అవుతున్న లీక్స్!

మెంటల్ మాస్ లుక్ లో పవన్..వైరల్ అవుతున్న లీక్స్!

Published on Feb 26, 2021 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డం కు ఒక సరైన సబ్జెక్ట్ తో మాంచి మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో చూసి చాలా కాలమే అయ్యింది. అందుకే గత కొన్నాళ్లుగా పవన్ సరైన హిట్ కొడితే చూడాలని అంతా అనుకుంటున్నారు. మరి ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలు లైనప్ కూడా బాగుంది కానీ సిసలైన సబ్జెక్టు మాత్రం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేస్తున్న సినిమాగానే కనిపిస్తుంది.

ఈ చిత్రం తాలూకా ప్రీ లుక్ కే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇందులో సరికొత్త పవన్ కళ్యాణ్ ను దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను మేకర్స్ రివీల్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. వచ్చే మార్చ్ 11న రివీల్ కానున్న పవన్ లుక్ ఇప్పుడు లీక్ అయ్యిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే అది అధికారిక పోస్టర్ కాదు కానీ ఆ లుక్ లో పవన్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ లుక్ లో పవన్ ను చూసిన అభిమానులు అయితే వెర్రెత్తిపోతున్నారు. క్రిష్ ఇలాంటి కాస్ట్యూమ్స్ లో పవన్ లుక్ ఊహించని విధంగా చూపిస్తాడని అనుకోలేదని లీక్ అయ్యిన ఫోటో అయినా కూడా వారే జోరుగా షేర్ చేసుకుంటుండం గమనార్హం..మొత్తానికి మాత్రం ఈ లీక్స్ మళ్ళీ పవన్ వరకు వచ్చేసాయి. ఇక ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం ఈ సినిమాను భాయీ వ్యయంతోనే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు