పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన దక్షిణాదిలో అపారమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. అయితే పవన్ రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ లో కూడా ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే పవన్ పాలిటిక్స్ మరియు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సినిమాలు అయితే ఇపుడు చాలానే ఒప్పుకున్నారు కానీ వాటిని ప్లాన్ చెయ్యడం వాటికి తగ్గట్టుగా పవన్ తనని తాను ప్రిపేర్ చేసుకోడం వంటివి చాలా పెద్ద టాస్కులే ముందున్నాయి.
ముఖ్యంగా పవన్ తన లుక్ పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పుడున్న ఆఫ్ లైన్ లుక్ లోనే తర్వాత సినిమాల్లో ఉంటే పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా కామన్ ఆడియెన్స్ కు కూడా అంతగా రుచించకపోవచ్చు. దీనితో పవన్ ఇప్పటి నుంచే తన లుక్ ను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నటిస్తున్న “వకీల్ సాబ్” లుక్ కే లాక్ డౌన్ లో చాలా చేంజ్ వచ్చేసింది. మరి పవన్ మరోసారి కసరత్తులు చెయ్యాల్సిన టైం దగ్గర పడుతుంది అని చెప్పాలి.