నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రానుందని తెలిసిందే. దాంట్లో మొదటి భాగం కథానాయకుడు ఈచిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , సహజ నటి జయసుధ పాత్రలో నటిస్తుందని సమాచారం.
ఇక గతంలో ఎన్టీఆర్ – జయసుధ కాంబినేషన్ లో డ్రైవర్ రాముడు , గజదొంగ , మహా పురుషుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ ను ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.