టాలీవుడ్ మొత్తం ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని ఐకానిక్ డైలాగులకు యూత్ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే, తాజాగా వైల్డ్‌ఫైర్ అంటూ అందాల భామ పాయల్ రాజ్‌పుత్ కూడా ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేసింది.
పుష్పరాజ్‌కి హిందీలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక హిందీలో పుష్ప చెప్పే డైలాగులకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా వైల్డ్‌పైర్ డైలాగ్‌ని పాయల్ తనదైన రీతిలో ఇమిటేట్ చేస్తూ వీడియో చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో పుష్పరాజ్ ఫీవర్ కేవలం కామన్ ఆడియెన్స్‌నే కాకుండా సెలెబ్రిటీలను సైతం రీల్స్ చేసేలా చేస్తోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.