పెద్ది: నిర్మాత చెప్పిన 1000 సార్లు షాట్ హాట్ టాపిక్ గా

పెద్ది: నిర్మాత చెప్పిన 1000 సార్లు షాట్ హాట్ టాపిక్ గా

Published on Apr 6, 2025 3:02 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే “పెద్ది”. పక్కా మాస్ గా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఫస్ట్ షాట్ దెబ్బకి ఇవుడు భారీ రెస్పాన్స్ పాన్ ఇండియా లెవెల్లో అందుకుంటుంది. అయితే ఈ వీడియో రాకముందు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

ఈ వీడియోలో ఒక్క షాట్ ని మాత్రం 1000 సార్లు రిపీట్ చేసేలా ఉంటుంది అని కితాబిచ్చారు. ఇక ఇపుడు సీన్ కట్ చేస్తే గ్లింప్స్ లో లాస్ట్ షాట్ కోసమే ఇపుడు అంతా హాట్ టాపిక్ గా మాట్లాడుతున్నారు. చరణ్ అలా బ్యాట్ పట్టుకొని కింద కొట్టి బాల్ ని కొట్టే సీన్ ని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు అని చెప్పడంలో సందేహం లేదు. దీంతో ఈ షాట్ ని మాత్రం నిర్మాత చెప్పినట్టే 1000 సార్లు రిపీట్ మోడ్ లో చూసే రేంజ్ లోనే ఉందని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు