గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈ సినిమా టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్ర ఆడియో రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ సొంతం చేసుకుందని.. పెద్ది చిత్ర సాంగ్స్‌తో పాటు స్కోర్‌ను ఇక టీ-సిరీస్‌లో విని ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు.
కాగా, ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర మ్యూజిక్‌పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ఈ గ్లింప్స్ వీడియో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.