‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ వీడియో సాంగ్ రిలీజ్

‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ వీడియో సాంగ్ రిలీజ్

Published on Dec 16, 2024 4:07 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురపిస్తోంది. రెండో వారంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ‘పుష్ప-2’ సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా రికార్డులను బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతుండటంతో, ఎవరూ ఊహించని రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ మూవీ.

తాజాగా ఈ చిత్రం నుండి ‘పీలింగ్స్’ అనే మాస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. థియేటర్లలో ఈ పాటకు, ఇందులో బన్నీ, రష్మికల స్టెప్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయడంతో, ఈ పాటను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్స్‌కు చంద్రబోస్ అందించిన లిరిక్స్ తోడవడంతో ఈ పాట సూపర్‌హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు