సమీక్ష : పేకమేడలు – సింపుల్ కథతో సాగే రియలిస్టిక్ డ్రామా !

సమీక్ష : పేకమేడలు – సింపుల్ కథతో సాగే రియలిస్టిక్ డ్రామా !

Published on Jul 19, 2024 4:31 PM IST
Peka Medalu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 19, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రేతికా శ్రీనివాస్, తదితరులు

దర్శకులు: నీలగిరి మామిళ్ల

నిర్మాత : రాకేశ్ వర్రె

సంగీత దర్శకులు: స్మరణ్ సాయి

సినిమాటోగ్రఫీ: హరిచరణ్

ఎడిట‌ర్ :

సంబంధిత లింక్స్: ట్రైలర్

నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా వచ్చిన సినిమా “పేకమేడలు”. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

బీటెక్ చదివి కూడా లక్ష్మణ్ (వినోద్ కిషన్) జాబ్ చేయడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కోట్లు సంపాదించాలని కలలు కంటూ, తన భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) సంపాదన పై బతుకుతూ ఉంటాడు. మరోవైపు వరలక్ష్మి చిన్నాచితక పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మణ్ కి NRI మహిళ శ్వేత (రేతిక శ్రీనివాస్)తో పరిచయం అవ్వడం, ఆమెతో అతను సన్నిహితంగా మెలగడం, దీంతో వరలక్ష్మికి – లక్ష్మణ్ కి గొడవలు జరుగుతాయి. ఇద్దరూ దూరం జరుగుతారు. ఆ తర్వాత ఈ ఇద్దరి జీవితాలు ఎలా మారాయి ?, గాలిలో మేడలు కట్టిన లక్ష్మణ్ సక్సెస్ అయ్యాడా? లేదా ?, చివరికి వరలక్ష్మి ఎన్ని బాధలు పడి తన కాళ్ళ పై తాను నిలబడుతుంది ? అన్నదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

దిగువస్థాయి మధ్యతరగతి భార్యాభర్తల జీవితాల నేపథ్యంలో సాగే కథాంశంగా మంచి నేటివిటీతో పాటు సహజమైన పాత్రల ఆధారంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల ఈ స్క్రిప్ట్ ను రాసుకోవడం సినిమాకి ప్లస్ అయింది. పనిపాట లేకుండా తిరిగే ఓ తాగుబోతు భర్త – ఆ భర్తను భరించే ఓ భార్య చుట్టూ దర్శకుడు అల్లిన డ్రామా కూడా బాగానే ఉంది. హీరోగా వినోద్ కిషన్ తన యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. హీరోయిన్ గా కనిపించిన అనూష కృష్ణ కూడా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె చాలా సహజంగా నటించింది.

మధ్యతరగతి జీవితాల బతుకులు ఎలా ఉంటాయో వినోద్ కిషన్ – అనూష కృష్ణ ఇద్దరూ తమ నటనతో కళ్ళకి కట్టినట్టు నటించి చూపించారు. అలాగే మరో కీలక పాత్రలో నటించిన రేతికా శ్రీనివాస్ కూడా చాలా బాగా నటించి మెప్పించింది. అలాగే మిగిలిన ప్ర‌ధాన‌మైన పాత్రల్లో నటించిన నటీనటులు కూడా త‌మ పాత్ర‌లకు పూర్తి న్యాయం చేశారు. భర్త పాత్ర అయిన లక్ష్మణ్ మనిషిగా ఎంత దిగజారిపోయాడో చూపించిన విధానం కూడా బాగుంది. అలాగే, వేధింపులకు గురి అయ్యే భార్యలు తమ జీవితాల్లో ఎలా ఎదగాలో చూపించిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు నీలగిరి మామిళ్ల రాసుకున్న సహజమైన పాత్రలు, ఆ పాత్రల చుట్టూ సాగే రియలిస్టిక్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఈ పేకమేడలు స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా సాగింది. క్యారెక్టర్స్ బిహేవియర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎన్.ఆర్.ఐ మహిళగా రేతిక శ్రీనివాస్ పాత్ర వచ్చే వరకూ జరిగే సీన్స్ కూడా చాలా సింపుల్ గా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా సాగుతాయి.

ఇక రేతిక శ్రీనివాస్ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు బాగున్నా.. ఆ పాత్ర ముగింపును ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. అదేవిధంగా లక్ష్మణ్ – వరలక్ష్మి పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిక్ట్ ను రాసుకోవాల్సింది. క్లైమాక్స్ సీక్వెన్స్ బాగానే పెట్టారు గానీ, కాకపోతే, అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొత్తమ్మీద దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను తీసుకున్నా.. అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన పాటలు బాగానే ఉన్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. హరిచరణ్ సినిమాటోగ్రఫీ బాగానే వుంది. స్లమ్ విజువల్స్ ను సహజంగా చాలా అందంగా చూపించారు. నిర్మాత రాకేశ్ వర్రె నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

సిటీలోని స్లమ్ నేపథ్యంలో ఓ మధ్యతరగతి జంట జీవితాల పై వచ్చిన ఈ ‘పేకమేడలు’ చిత్రం.. కొన్నిచోట్ల బాగానే ఆకట్టుకుంది. అయితే, కథ సింపుల్ గా సాగడం, అలాగే, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే, వినోద్ కిషన్, అనూష కృష్ణ నటన మరియు సినిమాలో స్లమ్ డ్రామా ఆకట్టుకున్నాయి. మొత్తమ్మీద ఈ స్లమ్ రియలిస్టిక్ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ ఓ వర్గం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు