నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ‘పేక‌మేడలు’ యూఎస్ రిలీజ్

ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రిలీజ్ అయిన ‘పేక‌మేడ‌లు’ మూవీకి మంచి స్పంద‌న ల‌భించింది. న‌టుడు రాకేష్ వ‌ర్రే నిర్మాత‌గా క్రేఈ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నీల‌గిరి మామిళ్ల డైరెక్ట్ చేసిన పేక‌మేడలు ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్ ని బేస్ చేసుకున్న క‌థ‌గా తెర‌కెక్కింంది. వినోద్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్ గా న‌టించింది.

ఈ సినిమా జూలై 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యి మంచి విజ‌యాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు యూఎస్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ నిర్వాణ మూవీస్ ‘పేక‌మేడ‌లు’ చిత్రాన్ని యూఎస్ లో జూలై 26న రిలీజ్ చేస్తుంది.

ఈ సంద‌ర్భంగా రాకేష్ వ‌ర్రే మాట్లాడుతూ.. ”మొదటి రోజు నుంచి సినిమాను ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ₹100 టికెట్ రేట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. ఇప్పుడు మా సినిమాని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరించినట్లు యూఎస్ఏ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నారు. ఈ సినిమాకు యూఎస్ ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంద‌ని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

Exit mobile version