విడుదల తేదీ : మార్చి 21, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, రోహిణి, రాంప్రసాద్
దర్శకుడు : అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాత: కే వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్
ఎడిటర్ :చింతల మధు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారంలో మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సప్తగిరి నటించిన ఎంటర్టైనర్ చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
38 ఏళ్ళు వయసొచ్చినా కూడా కట్నం ప్రసాద్ (సప్తగిరి)కి ఇంకా పెళ్లి కాదు. మలేషియాలో పని చేసుకునే తన కొడుకు కోసం 2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధం తప్ప పెళ్లి చేయకూడదు అని తన తండ్రి (మురళీ గౌడ్) డిసైడ్ ఇంకో పక్క ప్రియా (ప్రియాంక శర్మ) తన ఫ్యామిలీ యూఎస్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ప్రియా, ప్రసాద్ కోసం తెలుసుకుంటుంది. అతన్ని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకొని ప్లాన్ సక్సెస్ చేసుకుంటుంది. మరి ఈ విషయంలో ప్రసాద్ నాన్న రియాక్షన్ ఏంటి? అలా కథనంలో చోటు చేసుకున్న షాకింగ్ నిజం ఏంటి? ఎందుకు రెండు కుటుంబాలు అలాంటి కండిషన్స్ పెట్టుకున్నారు? ఈ అన్నిటి మధ్యలో ప్రసాద్ ఎలా నలిగిపోయాడు? అసలు చివరికి ఏమయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో నటుడుగా సప్తగిరిలో కొంచెం కొత్తదనం చూడవచ్చు. మునుపటి కొన్ని సినిమాల్లోలా కాకుండా ఈ సినిమాలో తన పాత్ర అందుకు తగ్గట్టుగా తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఒకింత క్లీన్ గా కనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ లో తన టైమింగ్ అలాగే హావభావాలు మంచి ఫన్ తెప్పిస్తాయి.
ఇక హీరోయిన్ గా ప్రియాంక శర్మ తన రోల్ లో ఫిట్ అయ్యింది. పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండే అమ్మాయిలా తన నటన, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆమె ఆకట్టుకుంటుంది. అలాగే తన పాత్ర కూడా కొంతమందికి కనెక్ట్ కావచ్చు.
ఇక తనతో పాటుగా మురళీధర్ గౌడ్, అన్నపూర్ణ తదితరులు తమ సీన్స్ లో బాగా చేశారు. అలాగే కథనంలో వీరిపై వచ్చే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మంచి ఫన్ ని జెనరేట్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్:
పెళ్లి కాని ప్రసాద్ లో ఒకింత నాచురల్ కామెడి లేదు అనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాలు ఫోర్స్డ్ గా ఇరికించినట్టుగా అనిపిస్తుంది. అవి కాస్తా అంత కామెడీ తెప్పించవు. అలాగే ఇంకొన్ని సీన్స్ అయితే డల్ కథనం మూలాన వీక్ గా అనిపిస్తాయి.
ఇక వీటితో పాటుగా సినిమాలో కొందరు నటీనటుల పాత్రలు చాలా చికాకు తెప్పించేలా ఉంటాయి. ప్రియాంక, మెహబూబ్ అలాగే ప్రమోదిని లాంటి వారి పాత్రలు సినిమాలో ఫ్లోని చెడగొట్టినట్టు అనిపిస్తాయి.
అలాగే సప్తగిరిపై కూడా కొన్ని సీన్స్ ఒకింత ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని డైలాగ్స్, కొన్ని సందర్భాలు కూడా అలానే ఉంటాయి.అలాగే క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. అంతా ఒకింత గందరగోళంగా నడిపించి ఒక నిరాశపరిచే ఎండింగ్ ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. మ్యూజిక్ ఓకే అని చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. కానీ ఇవేవి సినిమాని ఎఫెక్టివ్ గా మార్చలేదు. ఇక దర్శకుడు అభిలాష్ రెడ్డి విషయానికి వస్తే.. తాను ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసుకున్నారు కానీ దానిని బెటర్ గా షేప్ అవుట్ చేయడంలో డిజప్పాయింట్ చేసారని చెప్పక తప్పదు. లైన్ ఓకే కానీ దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం డల్ గా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ ని కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసుకున్నా కొంచెం ఓవరాల్ ఇంపాక్ట్ కలిగి ఉండేది ఏమో.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ‘పెళ్లి కాని ప్రసాద్’ లో మరింత కామెడీకి స్కోప్ ఉంది కానీ దానిని దర్శకుడు తన వీక్ కథనంతో నడిపించారు. సప్తగిరి నటుడుగా బాగానే చేసాడు కానీ సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. ఒకింత ఫ్రెష్ కామెడీ లాంటి వాటిని కోరుకునే వారు అయితే ఈ చిత్రం బదులు వేరే ఛాయిస్ చూసుకుంటే బెటర్.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team