పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా సొంత సంస్థ వంటిది – ‘ఈగిల్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రవితేజ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా సొంత సంస్థ వంటిది – ‘ఈగిల్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రవితేజ

Published on Dec 20, 2023 10:07 PM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్యథాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ మూవీ ఈగిల్. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల, నవదీప్, మధుబాల వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి దవ్జాండ్ సంగీతం అందిస్తున్నారు.

ఇక నేడు ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా ఒక ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆవిష్కరణ సభలో హీరో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ, దర్శకుడు కార్తీక్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని, సంగీత దర్శకుడు దవ్జాండ్ సౌండ్ ట్రాక్ లు థియేటర్స్ లో మరింత అద్భుతంగా ఉంటాయని అన్నారు. ట్రైలర్ కి తమకు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, తనకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సొంత బ్యానర్ వంటిదని, వారి సంస్థలో మరొక మూవీ చేస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈగిల్ మూవీ జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు