ఓటీటీ రివ్యూ : పెరుసు – నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం (తమిళ డబ్బింగ్ చిత్రం)

ఓటీటీ రివ్యూ : పెరుసు – నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం (తమిళ డబ్బింగ్ చిత్రం)

Published on Apr 14, 2025 10:04 PM IST

Perusu Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ఎమ్, చాందిని తమిళరసన్, బాల శరవణన్

దర్శకుడు : ఇలంగో రామ్
నిర్మాతలు : కార్తేకేయన్ సంతానం, హర్మాన్ బవేజా, హిరణ్య పెరెరా
సంగీతం : అరుణ్ రాజ్
సినిమాటోగ్రఫీ : సత్య తిలకం
ఎడిటర్ : సూర్య కుమారగురు
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

వైభవ్, సునీల్ రెడ్డిల అడల్ట్ కామెడీ పెరుసు ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. మొదట తమిళంలో ఉన్న ఈ చిత్రం తెలుగు మరియు అనేక ఇతర భాషలలో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ రివ్యూ చదవండి.

కథ:

తన గ్రామంలో గౌరవనీయులైన వ్యక్తి అయిన పరమానందం అకస్మాత్తుగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. అతని పెద్ద కొడుకు స్వామి (సునీల్ రెడ్డి) తన తండ్రి మరణం గురించి ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం మిగిలిన కుటుంబం ఓ సత్యాన్ని తెలుసుకుంటారు. ఇంతకీ, ఆ సత్యం ఏమిటి ?, అసలు పరమానందంకు నిజంగా ఏమి జరిగింది ?, వారు కనుగొన్న వింత విషయం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

హైలైట్ చేయాల్సిన మొదటి విషయం ఏమిటంటే తారాగణం పనితనం గురించే. వైభవ్ మరియు సునీల్ రెడ్డి నిజ జీవిత సోదరులుగా చాలా బాగా నటించారు. వారి మధ్య సహజ కెమిస్ట్రీ ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. వైభవ్ తాగుబోతు కొడుకుగా నమ్మశక్యంగా చాలా బాగా నటించాడు. సునీల్ రెడ్డి కూడా తన పాత్రకు తగ్గట్టుగా తన నటనతో మెప్పించాడు. మొత్తానికి ఈ ఇద్దరూ సినిమాను నిలబెట్టే స్థాయిలో తమ నటనతో అలరించారు.

నిహారిక ఎన్ఎమ్, చాందిని తమిళరసన్, బాల శరవణన్, మునిష్కాంత్ మరియు రెడిన్ కింగ్స్లీ వంటి సహాయ నటులు కూడా తమ నటన ద్వారా మరియు తమ సంభాషణల ద్వారా మంచి ఫన్ జనరేట్ చేశారు. దీనికితోడు సినిమా ఒక అడల్ట్ కామెడీ డ్రామా కావడంతో, పెరుసు సిట్యుయేషనల్ ఫన్ బాగా వర్కౌట్ అయింది. ప్రధాన పాత్రలను కథకు టర్నింగ్ పాయింట్స్ గా దర్శకుడు చాలా బాగా రాసుకున్నాడు. చివర్లో వచ్చే ఫన్ కూడా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

పెరుసు కొన్ని అంశాల్లో విజయం సాధించినప్పటికీ, అది పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ కామెడీ డ్రామా అందరికీ కాదు. సాంప్రదాయ హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు. అయితే, కథలో క్యారెక్టర్స్ ను, అలాగే చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు.

మొయిన్ గా వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అదే విధంగా కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. మొత్తానికి ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. దీనికితోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు. ఇక టెక్నీకల్ టీం లో అరుణ్ రాజ్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక సత్య తిలకం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు ఇలంగో రామ్ విషయానికి వస్తే.. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.

తీర్పు:

మొత్తమ్మీద , పెరుసు ఒక విచిత్రమైన అడల్ట్ కామెడీ డ్రామా. అడల్ట్ కామెడీ ఎలిమెంట్స్ ఇష్టపడే అభిమానులకు ఇది నచ్చుతుంది.నటీనటుల నటన కూడా బాగుంది. ముఖ్యంగా వైభవ్ – సునీల్ రెడ్డి చాలా బాగా నటించారు. కాకపోతే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ బాగా బోల్డ్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొన్ని చోట్ల మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు