ఓటీటీ సమీక్ష: ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా(తెలుగు డబ్బింగ్) – నెట్‌ఫ్లిక్స్

ఓటీటీ సమీక్ష: ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా(తెలుగు డబ్బింగ్) – నెట్‌ఫ్లిక్స్

Published on Aug 11, 2024 12:06 AM IST
Phir Aayi Hasseen Dillruba Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: తాప్సీ పన్ను, విక్రాంత్ మాసె, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్, ఆదిత్య శ్రీవాత్సవ తదితరులు

దర్శకులు: జయప్రద్ దేశాయి

నిర్మాతలు : ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్

సంగీత దర్శకుడు: సచెత్-పరంపర, అనురాగ్ సైకియా

సినిమాటోగ్రఫీ: విశాల్ సిన్హా

ఎడిట‌ర్ : హేమల్ కొఠారి

సంబంధిత లింక్స్: ట్రైలర్

తాప్సీ పన్ను, విక్రాంత్ మాసె, సన్నీ కౌశల్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఆగ్రా నగర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రాణి సక్సెనా(తాప్సీ పన్ను), రిషు(విక్రాంత్ మాసె) ఓ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ దేశం విడిచి పారిపోదామని అనుకుంటారు. రిషు బంధువైన నీల్ త్రిపాఠి(హర్షవర్ధన్ రాణె) హత్యకు గురికావడంతో పోలీసులు రాణి, రిషులను అనుమానిస్తుంటారు. అయితే, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు నీల్ అంకుల్ అయిన మృతుంజయ్(జిమ్మీ షెర్గిల్) రావడంతో రాణి, రిషులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో తనను ప్రేమించే అభిమన్యు(సన్నీ కౌశల్)ను రాణి పెళ్లాడుతోంది. ఇంతకీ ఈ అభిమన్యు ఎవరు..? రాణికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నాడు..? మృత్యుంజయ్ ఏం చేయబోతున్నాడు..? రాణి, రిషులు ఈ దేశం దాటి పారిపోతారా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

రాణి అనే పాత్రలో తాప్సీ పన్ను చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె నటనతో పాటు పాత్రలోని లోతును చాలా చక్కగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విక్రాంత్ మాసె ప్రేమికుడి పాత్రలో మంచి నటనను కనబరిచాడు. రాణి కోసం అతడు పడే ఆరాటం తెరపై స్పష్టం అవుతుంది. తాప్సీతో అతడి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక రాణిని ప్రేమించే మరో పాత్రలో సన్నీ కౌశల్ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశాడు. అతడి పాత్రలో కూడా మనకు వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. సినిమాకు అతడి పాత్ర చాలా ప్రాధాన్యతను తీసుకొస్తుంది.

ఈ సినిమా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఆగ్రా నగరం అందాలను చాలా చక్కగా చూపెట్టారు. కథకు ఆగ్రా నగరం ఎలా రిలేట్ అయ్యిందో మనకు ఈ సినిమా చూస్తే అర్థమయ్యేలా సినిమాటోగ్రఫీ వర్క్ ఉంది.

మైనస్ పాయింట్స్:

చక్కటి పర్ఫార్మెన్స్‌లు ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో వెనుకబడిపోయింది. ఈ కథ మనం ఇదివరకే చాలా సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్ లేకుండా కథ సాగడం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కథలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఆసక్తికర అంశం మిస్ అయ్యింది. జిమ్మీ షెర్గిల్, ఆదిత్య శ్రీవాత్సవ పాత్రలు చాలా వీక్‌గా డెవలెప్ చేశారు. సినిమాలో అవసరమైన ట్విస్ట్‌లు లేకపోవడం సినిమా కథను బోరింగ్‌గా మార్చేస్తాయి.

ఈ సినిమా క్లైమాక్స్ కూడా అందరికీ నచ్చేలా లేకపోవడం మరో మైనస్. సినిమాలోని పాత్రలు ఏం చేస్తున్నాయో అనే కన్ఫ్యూజన్‌లో పడేస్తాయి. దీంతో ఈ సినిమా ముగింపు అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోతుంది.

సాంకేతిక విభాగం:

కణిక ఢిల్లోన్ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉందని చెప్పాలి. జయప్రద్ దేశాయ్ దర్శకత్వ ప్రతిభ బాగున్నా, కథలోని బలహీనతలు ఆ ప్రతిభను కనబడకుండా చేస్తాయి. విశాల్ సిన్హా సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఈ సినిమాకు సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ కలిసొచ్చే అంశాలు. కానీ, ఈ మూవీ ఎడిటింగ్ సినిమాకు నష్టం కలిగించింది.

తీర్పు:

మొత్తంగా ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా చక్కటి పర్ఫార్మెన్స్‌లు ఉన్నప్పటికీ ఓ సాదాసీదా రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంగానే నిలిచింది. కథను ముందుగానే ఊహించగలడం, కథను సాగదీయడం వంటి అంశాలు సినిమాను మిస్‌ఫైర్ అయ్యేలా చేశాయి. ఈ సినిమా అందరినీ మెప్పించ లేకపోవచ్చు గనక ఈ వీకెండ్ ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమాను చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు