ఫోటో మూమెంట్స్ : పవన్, రామ్ చరణ్ లపై బ్యూటిఫుల్ స్నాప్


టాలీవుడ్ మెగా హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక ఎప్పుడూ కూడా మంచి స్పెషల్ గానే మెగా అభిమానుల్లో ఉంటుంది. మరి బాబాయ్ కోసం అబ్బాయ్, అబ్బాయ్ కోసం బాబాయ్ నిలిచిన సందర్భాలు కూడా చాలానే ఉండగా లేటెస్ట్ గా మరోసారి అలాంటి సంఘటన మెగా అభిమానుల హృదయాలను హత్తుకుంది.

తాజాగా పవన్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళ్లిన సంగతి తెలిసిందే. మరి అక్కడ నుంచి అభిమానులకి తాము ఇద్దరూ అభివాదం చేస్తున్న వీడియోలు కూడా కొన్ని బయటకి వచ్చి వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరిపై ఒక బ్యూటిఫుల్ పిక్ బయటకి వచ్చింది. ఇందులో ఎంతో ఆనందంగా కనిపిస్తున్న రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లను చూడవచ్చు.

ఇది మాత్రమే కాకుండా తన కోసం వచ్చిన తన వదినమ్మ సురేఖ అలాగే దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ లతో కలిసి రామ్ చరణ్, పవన్ లు కలిసి ఉన్న పిక్ కూడా ఇప్పుడు మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి అయితే ఈరోజు మాత్రం మెగా అభిమానులకి సాలిడ్ ట్రీట్ దక్కింది అని చెప్పాలి.

Exit mobile version