ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా తమ ఇంట్లోని ఆనందాలను తమ అభిమానులతో పంచుకుంది స్నేహా.
అల్లు అర్జున్‌తో కలిసి స్నేహా రెడ్డి గీతా ఆర్ట్స్‌లో వినాయకుడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి తమ పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో తన జీవిత భాగస్వామితో కలిసి కొన్ని మధురమైన జ్ఞాపకాలను ఫోటోల్లో క్లిక్‌మనిపించారు.
ఈ క్రమంలోనే స్నేహారెడ్డి ఓ విషయాన్ని భర్త అల్లు అర్జున్‌కి వివరిస్తుంటే వారి మధ్య సరదా క్షణాలను ఫోటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరో ఆయన భార్యతో చేస్తున్న సందడి, వారి జ్ఞాపకాలను తమకు పంచడంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.