మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అందుకోవడంతో మెగాస్టార్ పై వెల్లువలా ప్రసంశలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభిమానులతో పాటు అనేక మంది సినీ రాజీకయ ప్రముఖులు మెగాస్టార్ కి అభినందనలు తెలియచేశారు.
విషయం ఏమిటంటే, ఇటీవల ఆనిమల్ మూవీతో పెద్ద హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా అలానే దసరా మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాగా వారి కలయిక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.