ఫోటో మూమెంట్: తన 109 సినిమా దర్శకుడు బర్త్ డే వేడుకలో బాలయ్య..

ఫోటో మూమెంట్: తన 109 సినిమా దర్శకుడు బర్త్ డే వేడుకలో బాలయ్య..

Published on Aug 2, 2024 7:08 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా తెరకెక్కుతుండగా మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి నిన్ననే ఈ చిత్ర దర్శకుడు బాబీ పుట్టినరోజు కావున బాలయ్య అయితే తన దర్శకుడు బర్త్ డే వేడుకలు చేసినట్లు కనిపిస్తుంది.

బాబీ ఒక పిక్ షేర్ చేసుకొని తన ఆనందం వ్యక్తం చేశాడు. ఆశీస్సులు, విషెస్ అందించిన నటసింహం బాలకృష్ణ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అలాగే నా కుటుంబీకులు, శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని బాబీ తెలిపాడు. ఇలా బాలయ్య, తన ఫ్యామిలీతో కలిసి ఒక పిక్ ని షేర్ చేసాడు. మరి ఈ పిక్ లో బాలయ్యతో కలిసి వారు అంతా బెస్టాఫ్ లక్ చెబుతున్నట్టుగా థంబ్స్ అప్ చూపిస్తూ హ్యాపీ మూమెంట్ లో కనిపిస్తున్నారు. ఇలా ఈ పిక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు