ఫోటో మూమెంట్: చేతిలో ఒలింపిక్ టార్చ్ తో మెగాస్టార్ నయా పోస్ట్ వైరల్

ఫోటో మూమెంట్: చేతిలో ఒలింపిక్ టార్చ్ తో మెగాస్టార్ నయా పోస్ట్ వైరల్

Published on Jul 27, 2024 2:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి లండన్, ప్యారిస్ అంటూ వెకేషన్ కి వెళ్లారు.

మరి మొన్ననే వారసుడు రామ్ చరణ్, మనవరాలు క్లిన్ కారా అలాగే మెగా కోడలు ఉపాసన, తన భార్య సురేఖ గార్లతో కలిసి కనిపించిన చిరు ఈసారి ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ ఆరంభోత్సవానికి హాజరు అవుతున్నట్టుగా తెలియజేసారు. అయితే అక్కడ నుంచి మెగాస్టార్ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ అండ్ పోస్ట్ ని ఇపుడు షేర్ చేయడం వైరల్ గా మారింది.

ఒలింపిక్స్ ఆరంభోత్సవానికి హాజరు కావడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని అలాగే ప్రఖ్యాత ఒలింపిక్ టార్చ్ ని నా భార్య సురేఖతో కలిసి పట్టుకోవడం ఒక మధురానుభూతిగా నాకు మిగిలిపోయింది అని తెలిపారు. అలాగే ఇండియా నుంచి వెళ్లిన ప్రతీ క్రీడాకారునికి తన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని వారికి ఉత్సాహాన్నిస్తూ జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇందులో కౌ బాయ్ హ్యాట్ లో కనిపించిన చిరు లుక్ మరింత వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు