ఫోటో మూమెంట్: చిరు, బాలయ్యపై అదిరే ఫ్రేమ్..

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ అంతా కూడా తమ భారీ చిత్రాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. అయితే ఈ ఇద్దరూ కలిసిన సందర్భం అభిమానులకి ఎంతో స్పెషల్ గా మారుతాయి.

అలా రీసెంట్ గా బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకల్లో ఒకే స్టేజి పై బాలయ్య, చిరు కలిసిన మెగా మాస్ ఫ్రేమ్ కలిగించిన ఆనందం అంతా ఇంతా కాదు. మరి లేటెస్ట్ గా ఐఫా అవార్డ్స్ లో మరోసారి ఈ మెగా మాస్ ఫ్రేమ్ సాధ్యం అయ్యింది. ఈ వేడుకల్లో మెగాస్టార్ తో కలిసి బాలయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న పిక్ ఒకటి ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

దీనితో ఇది చూసిన మెగా మరియు నందమూరి అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య తన కెరీర్ 109వ సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా చిరు తన “విశ్వంభర” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలులో వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు ఆల్రెడీ ఫిక్స్ కాగా బాలయ్య సినిమా కూడా దాదాపు ఖరారు అన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version