టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాత్కాలికంగా తన చిత్రాలకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు రాజకీయాల్లోనే ఫుల్ గా బిజీగా ఉన్నారు. దీనితో సినిమాలు ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీనితో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా చెరో కోటి రూపాయల చొప్పున అనౌన్స్ చేశారు.
కొన్ని రోజుల కితమే ఏపీ ముఖ్యమంత్రికి తన 1 కోటి చెక్ ని అందజేశారు. మరి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి కోటి రూపాయల చెక్ ని అందజేసిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఇందులో పవన్, రేవంత్ సహా ఇంత ముఖ్యులు కూడా కనిపిస్తున్నారు. ఇక పవన్ చేయనున్న “హరిహర వీరమల్లు”, “ఓజి” చిత్రాలు ఈ సెప్టెంబర్ నుంచే మొదలు కానున్నాయని టాక్ ఇపుడు వినిపిస్తుంది.