ఫోటో మోమెంట్ : గ్రాండ్ గా జరిగిన వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహిని, నిషాంత్ ల వివాహం

ఫోటో మోమెంట్ : గ్రాండ్ గా జరిగిన వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహిని, నిషాంత్ ల వివాహం

Published on Mar 16, 2024 9:01 AM IST


టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేష్ ఇంట తాజాగా పెళ్లిబాజాలు మ్రోగాయి. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. మొదటి కూతురికి ఇప్పటికే వివాహం కాగా ఇప్పుడు రెండో కూతురు హవ్యవాహిని వివాహం నేడు వైభవంగా జరిగింది. కాగా హవ్యవాహిని ఎంగేజ్ మెంట్ విజయవాడకు చెందిన డాక్టర్ తో నిశాంత్ తో గత ఏడాది అక్టోబర్ లో చాలా సింపుల్ గా జరిగింది.

ఇక ఇప్పుడు పెళ్లి కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు దగ్గుబాటి ఫ్యామిలీ. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన హవ్యవాహిని, నిశాంత్ ల వివాహ వేడుకకు కొద్దిమంది టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. పూర్తిగా కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య ఈవేడుక జరిగింది. కాగా కొద్దిసేపటి క్రితం వీరి వివాహం తాలూకు ఫోటోలు అఫీషియల్ గా రిలీజ్ అయ్యాయి. కాగా పలువురు వెంకీ ఫ్యాన్స్, ఆడియన్స్ నూతన దంపతులకు ప్రత్యేకంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు