ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్ తో “హను మాన్” హీరో, దర్శకుడు


మన టాలీవుడ్ సినిమా హిస్టరీ లోనే సంక్రాంతి బరిలో వచ్చిన ఓ సినిమా భారీ సక్సెస్ ని అందుకున్నది ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేసిన చిత్రం “హను మాన్” ఒక్కటే అని చెప్పాలి. భారీ వసూళ్లు సాధించి తెలుగు సినిమా దగ్గర చెరగని ముద్ర వేసుకున్న ఈ సినిమా విజయం తర్వాత కూడా ఇంకా ఏదొక అంశంలో వినిపిస్తూనే ఉంది.

మరి తాజాగా మరోసారి హను మాన్ డ్యూయో వైరల్ గా మారారు. తెలంగాణ నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ని కలిశారు. మరి తమ హనుమాన్ ప్రతిమని వారికి అందజేసి కాసేపు ముగ్గురు కలిసి ముచ్చటించారు. మరి మూమెంట్ పిక్స్ బయటకి రాగా స్పెషల్ మూమెంట్ గా ఇవి వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు తేజ సజ్జ భారీ చిత్రం మిరాయ్, జై హనుమాన్ లతో బిజీగా ఉండగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అలాగే ఆక్టోపస్ సహా మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Exit mobile version