ఫోటో మూమెంట్: ఫ్యామిలీతో తారక్ దీపావళి వేడుకలు

ఫోటో మూమెంట్: ఫ్యామిలీతో తారక్ దీపావళి వేడుకలు

Published on Nov 1, 2024 11:06 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా “దేవర” తో భారీ సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ సినిమా రికార్డు వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే తారక్ తన బాలీవుడ్ డెబ్యూ భారీ యాక్షన్ సినిమా “వార్ 2” ని స్టార్ట్ చేసేసాడు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న తరుణంలోనే దీపావళి పండుగ వచ్చింది.

మరి వార్ 2 లో కొన్ని రోజులు పాల్గొని పండుగకి ఇంటికి వచ్చేసిన తారక్ తన కుటుంబంతో కలిసి ఈ దీపావళి పండుగని జరుపుకున్నాడు. అలా తనపై ఓ ఫ్యామిలీ పిక్ ఇపుడు బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది. మరి ఇందులో తారక్ తన భార్య పిల్లలు కూడా కనిపిస్తున్నారు. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ తర్వాత మళ్ళీ తారక్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు