ఫోటో మూమెంట్: మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రిషబ్ శెట్టి డైనమిక్ వాక్

ఫోటో మూమెంట్: మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రిషబ్ శెట్టి డైనమిక్ వాక్

Published on Aug 31, 2024 3:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర అదరగొడుతున్న సౌత్ స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే కన్నడ సినిమా నుంచి స్టార్ నటుడు అలాగే దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టిలు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరికి కూడా స్పెషల్ బాండింగ్ ఉన్న సంగతి అభిమానులకి తెలిసిందే. మరి ఈ ఇద్దరు పవర్ హౌస్ లు కూడా కలిసి కనిపిస్తే అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులు కలిసి కనిపించిన పిక్స్ కొన్ని అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇందులో తారక్ మరియు రిషబ్ లు మంగుళూరు ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది. మరి అక్కడ ఇద్దరూ కలిసి డైనమిక్ వల్ల చేస్తూ కనిపించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి తన ఫ్రెష్ లుక్ లో అదరగొట్టగా రిషబ్ తన కాంతార మేకోవర్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఈ ఇద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు