మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి మన దగ్గర భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు జపాన్ దేశంలో రిలీజ్ కి వెళ్ళింది. ఇక ఇక్కడ తారక్ ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసేందుకు ముందే వెళ్ళాడు. అయితే అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించిన తారక్ ఇపుడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడని చెప్పాలి.
తన భార్య ప్రణతిని కూడా జపాన్ తీసుకెళ్లగా అక్కడ తన బర్త్ డే వేడుకలు చేయడం విశేషం. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని తారక్ ఫొటోస్ గా షేర్ చేసుకోగా అవి ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇక దేవర చిత్రం రేపు మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ అక్కడ ప్రీమియర్స్ కి సాలిడ్ టాక్ వచ్చింది.