ఫోటో మొమెంట్ : మెగా ఫ్యామిలీ క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్స్


మెగా ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం తమ తమ కెరీర్ పరంగా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా పలు పండుగలు, శుభకార్యాల సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి వాటిని సంబరంగా జరుపుకుంటూ ఉంటారు.

అయితే విషయం ఏమిటంటే, నేడు క్రిస్మస్ సందర్భంగా మెగా ఫామిలీ మొత్తం కూడా కలిసి వేడుకగా ఆ పండుగని జరుపుకున్న అనంతరం దిగిన స్పెషల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ పిక్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ హీరో అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, అల్లు బాబీ, లావణ్య, స్నేహారెడ్డి, ఉపాసన సహా ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడవచ్చు.

Exit mobile version