ఫోటో మూమెంట్: మోడీతో మెగా కుటుంబం మెగా ఫ్రేమ్ వైరల్

ఫోటో మూమెంట్: మోడీతో మెగా కుటుంబం మెగా ఫ్రేమ్ వైరల్

Published on Jun 13, 2024 1:55 PM IST


గత కొన్ని రోజులు నుంచి కూడా మెగా అభిమానులు ఓ రేంజ్ లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో అందుకున్న విజయాన్ని తన కుటుంబం మొత్తం అంతటితో పంచుకోవడం అభిమానులని మరింత సంతోషాన్ని కలుగజేసింది. అయితే నిన్న కూడా ప్రమాణ స్వీకారం రోజున పవన్ కళ్యాణ్ సహా మెగాస్టార్ చిరంజీవి లతో దేశ ప్రధాని మోడీ కలిసి కనిపించిన విజువల్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారగా ఇప్పుడు మరో క్రేజీ పిక్ వైరల్ గా మారింది.

ఈసారి ఫొటోలో మెగా బ్రదర్స్ ముగ్గురూ పవన్ భార్య అనా లెజినోవా, పవన్ పిల్లలు అకీరానందన్, ఆద్యలు కూడా మోడీతో కనిపిస్తున్నారు. దీనితో ఈ సర్ప్రైజింగ్ మెగా ఫ్రేమ్ వైరల్ గా మారిపోయింది. ఇక పవన్, చిరు లు భారీ చిత్రాలు “ఓజి, వీరమల్లు, విశ్వంభర” సినిమాల్లో బిజీగా ఉన్నారు. చిరు విశ్వంభర దాదాపు పూర్తి చేయగా పవన్ ఈ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం విరామం తర్వాత వాటిని రీస్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు