మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుండగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మెగాస్టార్ పలు అరుదైన గౌరవాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇలా మెగాస్టార్ రీసెంట్ గానే యునైటెడ్ కింగ్డం ప్రభుత్వం నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ గౌరవాన్ని అందుకునే వ్యక్తిగా ఎంపిక అయ్యారు. అయితే ఈ మార్చ్ 19న జరగనున్న ఈ ఈవెంట్ కోసం మెగాస్టార్ అక్కడికి పయనమవ్వగా చిరంజీవికి అక్కడ మెగా అభిమానులు సాదర స్వాగతం పలికారు. దీనితో మెగాస్టార్ వారి రిసీవింగ్ చూసి ఆనందానికి లోనయ్యారు. దీనితో ఈ విజువల్స్ మంచి మూమెంట్స్ గా మారాయి. ఇలా అక్కడ నుంచి పలు దృశ్యాలు వైరల్ గా మారాయి.