ఫోటో మూమెంట్ : తమ్ముడికి సేవ చేస్తున్న నాగబాబు.. ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం మెగా అభిమానులు అంతా మంచి హై లో ఉన్నారని చెప్పాలి. ఓ పక్క సినిమాలు అలాగే మరో పక్క రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అలాగే ఇతర మెగా కుటుంబీకులు బిజీగా కనిపించారు. మరి నిన్నటితో మొత్తం ప్రచారం కంప్లీట్ అయిపోగా పవన్ హైదరాబాద్ కి చేరుకున్నాడు.

అయితే పవన్ సోదరుడు నాగబాబు కూడా పవన్ కోసం తీవ్రంగా ప్రచారం చేయగా లేటెస్ట్ గా నాగ బాబు ఒక బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ముఖం పై హ్యాండ్ టవల్ తో తుడుస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ పిక్ ఫ్యాన్స్ లో బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది. ఇక దీనికి నాగబాబు పవన్ ని ఉద్దేశించి కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

“నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే ‘చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని… నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే ‘వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని ‘రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని….అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను”. అని తెలిపారు. దీనితో ఈ పిక్ తో కూడిన పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version