ఫోటో మూమెంట్: ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలో మహేశ్ సందడి

ఫోటో మూమెంట్: ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలో మహేశ్ సందడి

Published on Sep 27, 2024 4:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 29వ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేశ్ ప్రస్తుతం కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఆయన తన స్నేహితులకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మహేశ్ తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకను జరిపి ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్పాడు. ఈ బర్త్‌డే వేడుకలో ఆయన భార్య నమ్రత కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక మహేశ్ బాబు ప్రస్తుతం గుబురైన గడ్డంతో పాటు లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఆయన రాజమౌళితో చేయబోయే సినిమా అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనుండటంతో, ఆ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు