ఫోటో మూమెంట్: స్విట్జర్లాండ్‌లో వరుణ్ తేజ్, లావణ్య వెకేషన్!

ఫోటో మూమెంట్: స్విట్జర్లాండ్‌లో వరుణ్ తేజ్, లావణ్య వెకేషన్!

Published on Oct 21, 2024 8:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముగించుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హాలీడే కోసం స్విట్జర్లాండ్ వెళ్లాడు.

ఆయనతో పాటు ఆయన భార్య లావణ్య కూడా స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. అక్కడ వారిద్దరు కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారి హాలీడేస్‌లో భాగంగా అక్కడి అందమైన ప్రదేశాలను వారు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. మంచు కొండల్లో వారు అడ్వెంచర్స్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఈ జోడీ వెకేషన్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేస్తుండగా, ఇందులో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు