ఫోటో మొమెంట్ : వరుణ్ – లావణ్య ల పెళ్ళిలో పవన్, చరణ్

ఫోటో మొమెంట్ : వరుణ్ – లావణ్య ల పెళ్ళిలో పవన్, చరణ్

Published on Nov 2, 2023 11:00 PM IST


యువ నటుడు వరుణ్ తేజ్, అందాల నటి లావణ్య త్రిపాఠి ల వివాహం నవంబర్ 1న ఇటలీలో ఎంతో వైభవముగా జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మొత్తం మూడు రోజుల పాటు జరిగింది. ముందుగా కాక్టెయిల్ పార్టీ, ఆ తరువాత హల్దీ, మెహందీ వేడుకలు జరుగగా అనంతరం వేదమంత్రాల సాక్షిగా వరుణ్, లావణ్యలు వివాహం చేసుకున్నారు.

విషయం ఏమిటంటే, ఈ వివాహ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటున్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ లో పవన్, చరణ్ ఇద్దరూ కూడా చిరునవ్వులు చిందించడం చూడవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు