ఫోటో మూమెంట్ : తన కూతురు ఆద్యతో పవన్ బ్యూటిఫుల్ సెల్ఫీ

ఫోటో మూమెంట్ : తన కూతురు ఆద్యతో పవన్ బ్యూటిఫుల్ సెల్ఫీ

Published on Aug 15, 2024 6:29 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు సినిమాలు చేస్తుండగా వాటిని అతి తొందరలోనే రీస్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రాలు పక్కన పెడితే ఇప్పుడు పవన్ తన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. మరి నేడు 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో ఈ వేడుకలు ఏపీ ప్రభుత్వం నిర్వహించారు.

అయితే ఈ వేడుకల్లో పవన్ కూడా పాల్గొనగా తన కూతురు ఆద్య కూడా వచ్చింది. మరి ఈ ఇద్దరిపై ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ పిక్ పవన్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది. పవన్ తన కూతురుతో కలిసి సెల్ఫీ దిగుతున్న పిక్ ని పవన్ బృందం క్లిక్ మనిపించారు. దీనితో ఈ ఫోటో ఇపుడు ఈ స్పెషల్ మూమెంట్ గా మారింది. ఇలా ఈ పిక్ ఇపుడు ఫ్యాన్స్ లో అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పవన్ పాలిటిక్స్ లో గెలిచిన తర్వాత ఇది వరకే ఆద్య సహా తన వారసుడు అకీరానందన్ ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు